by Suryaa Desk | Wed, Oct 02, 2024, 02:42 PM
దేవరకొండ మండలం,కొమ్మపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ కు ఏసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి హానరి డాక్టరేట్ అందుకున్నారు. హైదరాబాదులో జరిగినటువంటి.
తెలంగాణ సారస్వత పరిషత్తు లో ఏర్పాటు చేసినటువంటి సెమినార్లో ఈ అవార్డును స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు ఏసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సెమినార్లో అవార్డును యూనివర్సిటీ వారు అందించారు. గత 20 సంవత్సరాల సమాజ సేవను గుర్తించి ఈ అవార్డును అందించినట్లు తెలిపారు. ఇదే ఉత్సాహంతో ముందుకు పోయి మరింత సేవలందిస్తారని తెలిపారు. అవార్డును అందించినటువంటి యూనివర్సిటీ ఛాన్స్లర్ కు కృతజ్ఞతలు తెలిపారు.