![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 05:05 PM
'సభ నీ ఒక్కడిది కాదు' అని స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అనడం సరికాదని, అసెంబ్లీలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా ఈరోజు నిరసనలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. శాసనసభలో స్పీకర్ స్థాయిని తగ్గించేలా ఆయన మాట్లాడారని విమర్శించారు.స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లే నిరసన తెలపడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు. జగదీశ్ రెడ్డి చేసిన పొరపాటును బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం గుర్తించి, ఆయనను మందలిస్తుందనుకుంటే నిరసనలు చేపట్టడం విడ్డూరమని అన్నారు. బీఆర్ఎస్ నేతల తీరును ప్రజలు గమనించాలని కోరారు.