![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 06:13 PM
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని భూముల వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించారు. సుమారు 400 ఎకరాల భూములను పరిరక్షించాలని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, హెచ్‌సీయూ విద్యార్థులు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ సమావేశం ఏర్పాటు చేశారు.సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులు హాజరయ్యారు. వారి నుంచి ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఇదిలా ఉండగా, కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వన ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిని అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని ఫౌండేషన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. రేపు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.