![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 06:14 PM
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులు, నేరాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో దేవాలయం వద్ద ఓ మహిళపై, హైదరాబాద్ లో జర్మనీ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారాలు షాక్ కు గురి చేశాయని చెప్పారు. రేవంత్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేదనే విషయం అర్థమవుతోందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు 22 శాతం పెరిగాయని లెక్కలు చెపుతున్నప్పటికీ ఏమీ పట్టనట్టు రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరి దేనికి సంకేతమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని... మహిళల రక్షణపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.