![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 11:33 AM
శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్రకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన ఆకాశ్‌పురి హనుమాన్ దేవాలయం నుంచి సుల్తాన్ బజార్ వరకు ఈ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.2010 నుంచి తన ఆధ్వర్యంలో శోభాయాత్ర జరుగుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ పదిహేనేళ్లలో ఏ సంవత్సరం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని గుర్తు చేశారు. ఈ శోభాయాత్రలో లక్షలాది మంది రామభక్తులు భక్తితో పాల్గొంటుంటారని, క్రమశిక్షణతో ఉంటారని తెలిపారు. ఈ శోభా యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరారు.