|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 07:52 PM
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు.అబ్జర్వర్ మాజీ జడ్పి చైర్మన్ ధన్వంతరి గారు,ఇంఛార్జి డాక్టర్ అనిల్ గారు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత ఎలక్షన్స్ పై సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి లో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖలను,మండల పార్టీలను,బ్లాక్ అధ్యక్షులను,జిల్లా కార్యవర్గాన్ని నియమించుకొని పార్టీని ప్రతిష్టాత్మకంగా బలంగా రూపొందించాలని ఈ సమీక్ష సమావేశం నిర్వహించుకోవటం జరిగిందన్నారు.ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకలను గ్రామంలో ప్రతి లబ్ధిదారులకు చేరాలంటే గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉండాలన్నారు.రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో సైనికులలాగా పనిచేసి సంస్థాగత ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా చేసుకొని, రాహుల్ గాంధీ గారిని ప్రధాని గా చేసుకోవాలని పిలుపునిచ్చారు.