బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 03:35 PM
మావల పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్‌హెచ్‌ఓగా సీఐ స్వామి నియమితులయ్యారు. ఇన్నాళ్లూ ఈ స్టేషన్‌లో ఎస్‌ఐ స్థాయి అధికారులు ఎస్‌హెచ్‌ఓలుగా వ్యవహరించగా, తొలిసారిగా సీఐ స్థాయి అధికారిని నియమించారు. ఈ సందర్భంగా సీఐ స్వామి శనివారం ఆదిలాబాద్ డీపీఓ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిసి తన నియామక రిపోర్ట్ సమర్పించారు.
మావల పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తాను అవిరళ కృషి చేస్తానని సీఐ స్వామి పేర్కొన్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రజలకు న్యాయం చేసే దిశగా తన విధులను నిర్వహిస్తానని ఆయన హామీ ఇచ్చారు.