బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 03:43 PM
మావల పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓగా సీఐ స్థాయి అధికారి స్వామి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతను ఎస్ఐ స్థాయి అధికారులు నిర్వహిస్తుండగా, ఈసారి సీఐ స్థాయి అధికారిని నియమించడం విశేషం.
శనివారం ఆయన ఆదిలాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిసి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా సీఐ స్వామి మాట్లాడుతూ, "మావల పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తాను" అని తెలిపారు.
నూతన ఎస్.హెచ్.ఓగా నియమితులైన స్వామికి స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆయనతో ప్రజలు మంచి సంబంధాలు ఏర్పరుచుకోవాలని ఆశిస్తున్నారు.