|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 01:24 PM
భారత వ్యవసాయ రంగం సరికొత్త రికార్డు సృష్టించింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 357.73 మిలియన్ టన్నులకు చేరినట్లు తాజా ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2015-16లో 251.54 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి, ఇప్పుడు ఏకంగా 106 మిలియన్ టన్నులు పెరగడం గమనార్హం.ఈ వివరాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. బియ్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో 1,501.84 లక్షల టన్నులకు చేరిందని, ఇది గతేడాది (1,378.25 లక్షల టన్నులు) కంటే 123.59 లక్షల టన్నులు అధికమని తెలిపారు. గోధుమల ఉత్పత్తి కూడా 46.53 లక్షల టన్నులు పెరిగి 1,179.45 లక్షల టన్నులకు చేరిందని వివరించారు.