|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 10:39 AM
రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో మొదలైన పోలింగ్ . 412 డివిజన్లు, 2569 వార్డుల్లో ఎన్నికలు చేపట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం . ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 52.17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 40 వేల మందికి పైగా సిబ్బందిని నియమించారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్లు, ఇతర పోలింగ్ సామగ్రితో మంగళవారం సాయంత్రమే తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు సిబ్బంది చేరుకున్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ చేస్తోంది.