by Suryaa Desk | Thu, Dec 19, 2024, 11:55 AM
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 143 సినిమా గుర్గుండే ఉంటుంది. ఇందులో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించాడు. 2004లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. మంచి ప్రేమ కథను, కామెడీని, నక్సలిజం వంటి అంశాలను చూపించిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. ఇక పూరి జగన్నాథ్ సినిమాల్లో కనిపించే హీరోయిజం ఇందులోనూ హైలెట్‌గా నిలిచిందని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో సాయి రామ్ శంకర్‌కు జోడిగా సమీక్ష సింగ్ అనే హీరోయిన్ నటించింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఉన్నింటి అమ్మాయి ఆ ఇంట్లో పనిచేసే కుర్రాడితో ప్రేమించే యువతి పాత్రలో సమీక్ష మంచి నటనను కనబరించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు భారీగా ఆఫర్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ దానికి విరుద్ధంగా సమీక్ష ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. ఇంతకీ ఇప్పుడీ బ్యూటీ ఏం చేస్తోందో తెలుసా.? సమీక్ష సింగ్ తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీతో పాటు హిందీలో నటించి మెప్పించింది. సినిమాలతో పాటు పలు మ్యూజిక్ వీడియోల్లో కూడా కనిపించింది. ఆ తర్వాతే పూరి జగన్నాథ్ 143 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమా తర్వాత సమీక్ష కొత్త కథ, ఇది సంగతి, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, సామ్రాజ్యం, దడ, కులుమనాలి వంటి సినిమాల్లో నటించింది. ఇక బుల్లి తెరపై కూడా సందడి చేసింది. అయితే 2020 తర్వాత సమీక్ష పూర్తిగా సినిమాలకు దూరమైంది. 2020లో సింగపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వెండి తెరకు పూర్తిగా దూరమైంది. ఇక భర్తతో కలిసి మాక్స్, మిన్ , మియోజాకి సినిమాను ప్రొడ్యూస్ చేసింది. వెండి తెరకు దూరమైన సోషల్ మీడియా ద్వారా మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. తన లేటెస్ట్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి.
Latest News