![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 11:39 AM
ఇళయరాజా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మ్యూజిక్ మ్యాస్ర్టో 50 ఏళ్ల జర్నీని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. లండన్ పర్యటన పూర్తిచేసుకున్న ఇళయరాజాను సీఎం స్టాలిన్ కలిశారు. ఈ విషయాన్ని పంచుకున్న సీఎం ఎక్స్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇళయరాజా అర్థశతాబ్దపు మ్యూజికల్ జర్నీని ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో ఆయన అభిమానులంతా భాగంగా కావాలని కోరారు. మరోవైపు ‘సింఫొని’ కార్యక్రమాన్ని 13 దేశాల్లో నిర్వహించడానికి ఒప్పందం కుదిరినట్టు ఇళయరాజా తాజాగా వెల్లడించారు. మార్చి 9న లండన్‌లో ‘సింఫొని’ సంగీత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబాయ్, ప్యారిస్ తదితర చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ‘సింఫొని’ కార్యక్రమాన్ని డౌన్‌లోడ్ చేసుకొని వినవద్దని, తనను అభిమానించేవారు ప్రత్యక్షంగా ‘సింఫొని’ సంగీతాన్ని వినాలని విజ్ఞప్తి చేశారు. 82 ఏళ్లలో తాను ఏం చేస్తానని అనుకోవద్దని, ఇకపైనే ఆట ఆరంభిస్తున్నానని పేర్కొన్నారు.
Latest News