![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 11:37 AM
మిల్కీబ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకున్నారంటు గత వారంగా వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో వీరిద్దరూ తాజాగా హోలీ వేడుకల్లో సందడి చేశారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఏర్పాటు చేసిన హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ పాల్గొన్నారు. ప్రేమలో ఉన్నప్పుడు వీరిద్దరూ ప్రతి పార్టీకి కలిసి హాజరయ్యేవారు. కానీ, ఇప్పుడు మాత్రం విడివిడిగా రవీనా ఇంటికి వచ్చారు. ఫొటోగ్రాఫర్లను పలకరించి.. హోలీ విషెస్ చెప్పారు. ‘లస్ట్ స్టోరీస్ 2’లో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పారు. పెళ్లి, కెరీర్ విషయంలో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. అందుకు స్రేమ బంధానికి ముగింపు పలికారని బీటౌన్‌లో ప్రచారం జరిగింది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలన్నది తమన్నా ప్లాన్. విజయ్ వర్మ మాత్రం దానికి సుముఖంగా లేరని టాక్. వివాహం చేసుకోవడానికి తాను సిద్థంగా లేనని.. ఇంకా సమయం కావాలని అన్నారట. దీంతో వీరిద్దరూ ప్రేమకు కట్ చెప్పి, ఫ్రెండ్స్‌గా ఉండాలని నిర్ణయించుకున్నారని బీటౌన్ టాక్. అయితే ఈ వార్తలో ఎంతత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. బ్రేకప్ వార్తలపై తమన్నా, వర్మ ఎక్కడా స్పందించలేదు.
Latest News