![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 08:12 PM
రోషన్ కనకాల ప్రస్తుతం హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం మోగ్లీ 2025. ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కలర్ ఫోటోతో జాతీయ అవార్డు గెలుచుకుని అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించిన సందీప్ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ చిత్రం పై అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ – కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ‘మోగ్లీ 2025’ ఒక ట్రెండీక ప్రేమకథ. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ గత నెలలో ప్రారంభమైంది. అయితే, నేడు రోషన్ కనకాల పుట్టినరోజు.కాగా రోషన్ కనకాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిర్మాతలు ఒక అద్భుతమైన కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రోషన్ కనకాల లుక్స్, మెడలో గొలుసులా వేలాడుతున్న ఓ గద, అలాగే అతని చేతి చుట్టూ చుట్టబడిన ఓ వస్త్రం.. మొత్తానికి రోషన్ పాత్రలోని డెప్త్ ను బాగా ఎలివేట్ చేస్తోంది ఈ పోస్టర్. ఇప్పటికే, ఈ సినిమా గ్లింప్స్ రోషన్‌ను హై-ఆక్టేన్ యాక్షన్ అవతార్‌లో చూపించింది. ఇక ఈ చిత్రంలో కొత్త నటి సాక్షి సాగర్ మడోల్కర్ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమాకి రామ మారుతి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.
Latest News