![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 07:56 PM
ఇటీవల నాగచైతన్య, శోభిత వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే నాగ చైతన్యకు కార్లు, కార్ రేసింగ్‌లు ఎంత ఇష్టమో చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ క్రమంలో తాజాగా నాగచైతన్య.. శోభితకు కార్ రేసింగ్ నేర్పుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శోభిత కూడా అతని ఆసక్తులను పంచుకుంటూ వారి బంధాన్ని మరింత బలం పరుచుకుంటోంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సినిమాల విషయానికి వస్తే కనుక నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. చందూ మొండేటి దర్శకత్వంలో, సాయి పల్లవితో కలిసి నాగ చైతన్య అద్భుత నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా అక్కినేని కుటుంబంలో 100 కోట్ల గ్రాస్ సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ, నాగ చైతన్య కెరీర్‌లో ఒక మైలురాయిగా మారింది.