![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 12:35 PM
సోషల్ మీడియా అంతా ఆ భామ జపమే..! ఇన్‌స్టా రీల్స్ ఓపెన్ చేసినా ఆ బ్యూటీ దర్శనమే..! కొన్ని రోజులుగా సోషల్ మీడియాను దత్తత తీసుకుంది ఆ ముద్దుగుమ్మ.ఒక్క తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు టాలీవుడ్‌పై దండయాత్రకు సిద్ధమవుతుంది. ఎంట్రీకి ముందే రెండు లు సైన్ చేసింది.. ఇంతకీ ఎవరా సెన్సేషనల్ హీరోయిన్..?కయాడు లోహర్.. 15 రోజుల కింది వరకు ఈ పేరు కూడా మన ఆడియన్స్‌కు తెలియదు.. అస్సలు పరిచయమే లేదు. కానీ ఇప్పుడేమో కయాడు అనే పేరు సోషల్ మీడియాలో ఒక సంచలనం.ఇన్‌స్టా రీల్స్ చూసినా.. ట్విట్టర్ ఓపెన్ అయినా కనిపిస్తున్నారు కయాడు లోహర్. డ్రాగన్ తర్వాత ఈ భామ సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్‌తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు కయాడు.
ప్రస్తుతం తమిళంలో అధర్వతో ఇదయం మురళిలో నటిస్తున్న ఈ బ్యూటీ.. తెలుగులో విశ్వక్ సేన్, అనుదీప్ కాంబినేషన్‌లో వస్తున్న ఫంకీలో నటిస్తున్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే.. తాజాగా మరో ఖతర్నాక్ ఆఫర్ కయాడు లోహర్‌కు వచ్చింది.రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో రానున్న లో కయాడును ఓ హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈమెతో పాటు ప్రేమలు ఫేమ్ మమిత బైజు పేరు పరిశీలనలో ఉంది.మూడేళ్ళ కింద శ్రీవిష్ణు అల్లూరి తో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు కయాడు. అప్పుడు రాని క్రేజ్.. ఇప్పుడు డ్రాగన్ తో వచ్చింది. చూస్తుంటే టాలీవుడ్ నెక్ట్స్ బిగ్ థింగ్ అయ్యేలాగే ఉన్నారు ఈ డ్రాగన్ సుందరి.
Latest News