![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 11:33 AM
రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమా 'బ్రహ్మాస్త్ర' . కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. తెలుగులోనూ ఈ సినిమా డబ్ అయ్యింది. అయితే... భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. అప్పుడే 'బ్రహ్మాస్త్ర-2' కూడా ఉంటుందని మేకర్స్ చెప్పారు. కానీ తొలిభాగానికి ఆశించిన స్థాయిలో విజయం దక్కకపోవడంతో... రెండో భాగం ఉంటుందా ఉండదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఇటు ఆ చిత్ర కథానాయకుడు, దర్శకుడు ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోవడంతో ఇక 'బ్రహ్మాస్త్ర -2'ను అటకెక్కించినట్టే అనే వార్తలు బాలీవుడ్ లో బలంగా వినిపించాయి. దానిపై తాజాగా హీరో రణబీర్ కపూర్ పెదవి విప్పాడు. అందరూ అనుకుంటున్నట్టుగా 'బ్రహ్మాస్త్ర-2' సినిమా ఆగిపోలేదని స్పష్టం చేశాడు. అయితే... దర్శకుడు అయాన్ ముఖర్జీ... హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్న 'వార్ -2' సినిమాతో బిజీ ఉన్నారని, ఒక్కసారి ఆ సినిమా విడుదలై పోయిన తర్వాత 'బ్రహ్మాస్త్ర-2' పైనే ఆయన ఫోకస్ పెడతాడని అన్నారు. తమ చిత్రం ఆలస్యమౌతోంది తప్పితే ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చాడు.
Latest News