|
|
by Suryaa Desk | Mon, Mar 17, 2025, 04:35 PM
పుష్ప-2 సినిమా సుకుమార్ స్థాయిని అమాంతం పెంచేసింది. టాలీవుడో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతుండడంతో తెలుగు డైరెక్టర్ల క్రేజ్ పెరిగిపోయింది. దీంతో తెలుగు దర్శకులతో పనిచేయడానికి బాలీవుడ్ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ సుకుమార్‌తో ఓ సినిమా తీయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సుకుమార్ బిజీ షెడ్యూల్ కారణంగా అది కుదరకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతన్నారు.పుష్ప 2’ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి సుకుమార్ ఓ బాలీవుడ్ హీరోతో భారీ ప్రాజెక్టు కోసం చర్చలు జరుపుతున్నాడు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో సుకుమార్ చేయబోయే మూవీ ఇంటెన్స్ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ గా ఉండబోతుందని ఇన్నాళ్ళూ టాక్ నడిచింది. కానీ తాజాగా వినిపిస్తున్న బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం ఇదొక రూరల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. సుకుమార్ సినిమాలో షారుక్ ఖాన్ రా అండ్ రస్టిక్ అవతార్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
Latest News