![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 11:41 AM
ఈ ఏడాది విడుదల కానున్న భారీ చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పవన్ కల్యాణ్ కథానాయకుడు. జ్యోతి కృష్ణ దర్శకుడు. ఏ.ఎం.రత్నం సమర్పణలో ఏ.దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. మొఘల్ రాజుల నుంచి కోహినూర్ వజ్రాన్ని చేజిక్కించుకోవడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకునేందుకు వీరమల్లు సిద్ధమవుతున్నారు. అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని మొదట మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నారు.కానీ నిర్మాణానంతర కార్యక్రమాలు కొనసాగుతున్నందున విడుదలను వాయిదా వేశారు. ఈ ఏడాది మే 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ శుక్రవారం తెలిపారు.
Latest News