![]() |
![]() |
by Suryaa Desk | Fri, Feb 07, 2025, 12:15 PM
నాగ చైతన్య హీరోగా నటించిన మూవీ 'తండేల్' ఫిబ్రవరి 7న థియేటర్స్‌లోకి వచ్చేశాడు. ఇప్పటికే ఓవర్సీస్‌లో షోలు పడ్డాయి. దీంతో సినిమా ఎలా ఉందో ట్విటర్ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. శోభితతో పెళ్లి తర్వాత వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చందు మొండేటి డైరెక్షన్‌కు తోడు ఈ మూవీలో సాయి పల్లవి ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెల కొన్నాయి. మత్స్యకార బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన తండేల్ మూవీకి ప్రధాన బలం సంగీతం అంటూ ఎక్కువమంది దేవీ శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా కథ చెప్పడంలో కాస్త స్లోగా ఉన్నా ఫైనల్‌గా ప్రేక్షకులకు నచ్చుతుందని నెటిజన్లు అంటున్నారు. కథలో చాలా బలం ఉన్నప్పటికీ కొన్ని సీన్ల విషయంలో బాగా విసుగుతెప్పించాడని డైరెక్టర్‌పై విమర్శలు వస్తున్నాయి. కొందరు మాత్రం అలాంటిదేమీ లేదని, కొందరు కావాలనే పనికట్టుకుని మరీ సినిమాపై నెగటివిటిని తీసుకొస్తున్నారని తెలుపుతున్నారు. 'లవ్‌స్టోరి' హిట్ తర్వాత ఈ జోడి మరోసారి భారీ విజయం అందుకుందని తెలుపుతున్నారు. తండేల్ ప్రయాణంలో నాగచైతన్య, సాయి పల్లవి నటన అద్భుతమని కొందరు అంటున్నారు. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని, సెకండాఫ్ మాత్రం దుమ్మురేపారని చెబుతున్నారు. ముఖ్యంగా నాగచైతన్య కెరీర్‌లో ఎప్పటికీ మరిచిపోలేని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలుస్తోంది. తెరపై ఆయన్ను చూసిన ఆభిమానులే ఆశ్చర్యపోతున్నారు. ప్రతి సీన్‌లో ఏంతమాత్రం తగ్గకుండా మెప్పించాడంటూ ప్రశంసలు వస్తున్నాయి. తండేల్ సినిమాకు మరో బలం దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటూ కొందరు చెబుతున్నారు. ప్రతి సీన్‌లో బీజీఎమ్‌తో గూస్‌బంప్స్ తెప్పించాడని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బుజ్జి తల్లి పాటతో సినిమాను మరింత పీక్స్‌కు తీసుకెళ్లారని చెబుతున్నారు. సినిమా విషంయలో ఒకటి లేదా రెండు నెగటివ్ కామెంట్లకు మించి పెద్దగా ఎక్కడేకాని కనిపించడం లేదు. ట్విటర్‌లో సినిమాపై బాగుందనే ఎక్కువగా వినిపిస్తుంది. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా తండేల్ కథ సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇదీ 'లవ్‌స్టోరి' బ్లాక్ బస్టర్ జోడీ అంటూ సినిమాపై భారీగా ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం ట్విటర్‌లో వచ్చిన అంశాలను మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి రివ్యూ గురించి మరి కొన్ని గంటల్లో తెలుసుకుందాం.
#Thandel Review : A MUST WATCH ! #NagaChaitanya delivered a standout performance as Thandel Raju dominating every scene with his mature acting as Rural Fisherman #SaiPallavi brought the emotional depth & carried the core plot. #DeviSriPrasad music proved to be a biggest soul… pic.twitter.com/PNrwogswhA
— Tollywood Box Office (@Tolly_BOXOFFICE) February 7, 2025
#ThandelReview
- Oka manchi love track
- Beautiful Songs
- koncham patriotic touch tho movie ni end chestaad bhayya
Chatinaya Comeback after 5yrs
3.5/5 #Thandel pic.twitter.com/uwOJnYKLZO
— ᴏʀᴀɴɢᴇ ᴀʀᴍʏ (@Baahubali230) February 7, 2025
Here is the #Review of #Thandel
Its a decent love story with a not so effective Patriotic backdrop!
/5
Best thing about #Thandel is the mesmerising chemistry of lead pair. All the scenes involving #NagaChaitanya and #SaiPallavi came out very well ! #DSP gave… pic.twitter.com/jK6RICuSPu
— FILMOVIEW (@FILMOVIEW_) February 7, 2025