![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 12:46 PM
నాగ చైతన్య నటనపై అనేక విమర్శలు ఉన్నాయి. దీనిని నాగ చైతన్య కూడా అంగీకరించాడు. యాక్టింగ్ అనేది ఒక లెర్నింగ్ ప్రాసెస్.. ఇంప్రూ అవుతోంది అని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'తండేల్' సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కేవలం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడం మాత్రమే కాకుండా.. చైతన్య పర్ఫామెన్స్ కు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే చైతన్య తండ్రి, నటుడు నాగార్జున ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు.తండేల్ సక్సెస్ కావడంతో నాగార్జున పోస్టు చేస్తూ.. ‘‘డియర్ చైతన్య.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం నువ్వు సవాళ్లు ఎదుర్కోవడం, నటుడిగా పరిధులు దాటడం చూశా. ‘తండేల్’.. సినిమా మాత్రమే కాదు నీ ప్యాషన్, కష్టానికి నిదర్శనం. అక్కినేని అభిమానుల్లారా.. మీరంతా కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడూ మా వెన్నంటే ఉన్నారు. మీ ప్రేమ, సపోర్ట్‌కు ధన్యవాదాలు. సాయి పల్లవి కంగ్రాట్స్. దేవిశ్రీ ప్రసాద్.. నువ్వు రాకింగ్. రైజింగ్ స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి, తండేల్ టీమ్‌కు, నిర్మాతలు అల్లు అరవింద్ గారు, బన్నీ వాసుకు బిగ్ థాంక్స్’’ అని రాసుకొచ్చారు.
Latest News