![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 01:10 PM
తాజాగా నటి కరీనా ఇన్‌స్టా వేదికగా కపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జీవితంలో మనం అనుకునే సిద్థాంతాలు, ఊహలు ఏవీ నిజాలు కావు. ఇతరుల కంటే మనమే గొప్ప తెలివైనవాళ్లం అనుకుంటాం. సందర్భం వచ్చినపుడు జీవితం మన మెడలు వంచి గుణపాఠాలు చెబుతుంది’’ అని బాలీవుడ్ నటి కరీనా కపూర్ తన ఇన్‌స్టాగ్రాం స్టోరీలో హార్ట్ ఈమోజీతో పోస్టు చేశారు. తన భర్త సైఫ్‌అలీఖాన్‌పై ఇటీవల ఓ ఆగంతుకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పెట్టిన ఈ పోస్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ‘‘ఈ పెళ్లిళ్లు, విడాకులు, ఆందోళనలు, పిల్లలు పుట్టడం, ఆత్మీయుల మరణాలు, పిల్లల పెంపకం.. ఇవన్నీ మనదాకా వస్తేనే పూర్తిగా అర్థమవుతాయి. గత నెల 16న సైఫ్‌పై దాడి జరిగిన రోజు లైఫ్ అంటే ఏంటో తెలిసింది. మా కుటుంబానికి ఎంతో సవాలుతో కూడిన రోజు అది. ఏమి జరిగిందో ఇప్పటికీ మాకు పూర్తిగా అర్థం కావడం లేదు. ఈ కష్ట సమయంలో కనికరం లేని ఊహాగానాలు, కథనాలకు దూరంగా ఉండాలని మీడియాకు, ఫొటోగ్రాఫర్లకు మనవి చేస్తున్నా’’ ఆమె వ్యాఖ్యానించారు.
Latest News