![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 12:33 PM
ఇపుడు తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు పలువురు చెబుతున్నారని, దీనికి కారణం క్రియా యోగా అని సూపర్‌స్టార్ రజనీకాంత్ వెల్లడించారు. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలోని వైఎస్ఎస్ రాంచీ ఆశ్రమానికి వెళ్ళిన ఆయన కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈ ఆశ్రమంలో తాను పొందిన అనుభవాన్ని ఒక వీడియో రూపంలో రికార్డు చేయగా, ఆ వీడియోను రాంచీ ఆశ్రమ నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు.ఇందులో రజనీకాంత్ మాట్లాడుతూ ‘‘వైఎస్ఎస్ రాంచీ ఆశ్రమానికి మూడుసార్లు వచ్చాను. పరమహంస యోగానంద గదిలో కూర్చొని యోగా చేసే భాగ్యం దక్కింది. ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేను. 14 యేళ్ళ తర్వాత ఈ ఆశ్రమానికి వచ్చాను. ఇకపై ప్రతి యేటా ఆశ్రమానికి వచ్చి ఒక వారం రోజుల పాటు ఇక్కడే గడపాలని నిర్ణయం తీసుకున్నాను.ఇపుడు నేను ఎంతో ఉత్సాహంగా (వైబ్) ఉన్నానని, నన్ను చూస్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తుందంటున్నారు. దాని రహస్యం క్రియా యోగా సాధన. 2002 నుంచి ఈ యోగా చేస్తున్నాను. ఆరంభంలో ఎలాంటి మార్పులేదు. అయినప్పటికీ మధ్యలో ఆపలేదు. ఒక దశలో అంటే 12 యేళ్ళ తర్వాత మార్పు కనిపించింది. నాలో శాంతి, ప్రశాంతత లభించింది. క్రియో యోగా శక్తి అది. దీని గురించి తెలిసిన వారికి ఆ శక్తి ఏంటో తెలుసు. ఇది అత్యంత రహస్యం. ఇది అందరికీ ఉపయోగపడాలి’’ అని పేర్కొన్నారు.
Latest News