![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 03:33 PM
డ్యాన్సర్ కావాలని కలలు కన్న అమ్మాయి. తర్వాత డ్యాన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. డాక్టర్ చదివింది.కానీ తనలోని కళను గుర్తించిన వాళ్లు చాలామందే ఉన్నారు. అందుకే మళయాలంలో ప్రేమమ్ అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించేందుకు ఒప్పుకుంది. అందుకు తన 'కండీషన్స్' తనకు ఉన్నాయి. అన్నిటికీ ఒప్పుకున్న తర్వాతే మలర్ పాత్రలో నటించిన అందరినీ మెస్మరైజ్ చేసింది. ప్రేమమ్ మళయాల సినిమానే అయినా భాషతో సంబంధం లేకుండా అందరికీ నచ్చిన పాత్ర తనదే. ఆ తర్వాత ఫిదా మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. భానుమతి సింగిల్ పీస్ అనే డైలాగ్ తో తనే డబ్బింగ్ కూడా చెప్పుకుని ఇక్కడి ప్రేక్షకులకూ ఫిదా చేసింది. గ్లామర్ పాత్రలకు, స్కిన్ షోకు దూరంగా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న కథలనే సెలెక్ట్ చేసుకుంటూ.. ఇప్పుడు సాయి పల్లవి నటించిందంటే కథలో దమ్ముంది అనుకునేంత వరకూ సాగుతోంది తన ప్రయాణం. ఈ ప్రయాణంలో అత్యంత ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న నటిగా పేరు తెచ్చుకుంది. ఆ పేరే ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచే వరకూ వెళ్లింది.మళయాలంలో తను నటించిన ప్రేమమ్ మూవీకి ఆమెకు ఇచ్చిన రెమ్యూనరేషన్ 10 -15 లక్షల వరకు. అంటే సినిమాలో ఇంకో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు. తనే సినిమా అంతా ఉండదు. అందుకే అనుకోవడానికి లేదు. ఫస్ట్ టైమ్ హీరోయిన్ గా నటిస్తోంది. అప్పటికి మళయాల సినిమా పరిశ్రమ చాలా చిన్నది. వారి వరకూ ఈ అమౌంట్ పెద్దదే. బట్ ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. 5 - 6 కోట్లు. యస్.. సాయి పల్లవి ఇప్పుడు దాదాపు 6 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటోంది.
తాజాగా తను నటించిన తండేల్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. లాస్ట్ ఇయర్ చేసిన తమిళ్ మూవీ అమరన్ ఏకంగా 350 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ రెండు సినిమాల్లోనూ తన నటనే మెయిన్ హైలెట్ అంటే అతిశయోక్తి కాదు. అఫ్ కోర్స్ బలమైన కథలు కూడా ఉన్నాయి. ఆ కథలను మోయగలిగే సత్తా నటుల్లో ఉండాలి కదా. అటు శివకార్తికేయన్, ఇటు నాగ చైతన్య ఇద్దరూ అదరగొట్టినా డామినేషన్ మాత్రం సాయి పల్లవిదే.ప్రస్తుతం బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది సాయి పల్లవి. రామాయణం మూవీలో సీతగా కనిపించబోతోంది. తను ఇప్పటి వరకూ సంపాదించుకున్న ఇమేజ్ ను బట్టి ఈ పాత్రకు తను వందశాతం కరెక్ట్ అని అంతా అంటారు. మొత్తంగా పది, పదిహేను లక్షలతో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు ఏకంగా 6 కోట్ల వరకూ వెళ్లిందంటే.. అది కూడా ఏ మాత్రం గ్లామర్ షో లేకుండా.. అది కేవలం తన స్వయంకృషి మాత్రమే అని చెప్పాలి.
Latest News