![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 02:54 PM
'దేవర' చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీలో 'వార్ 2’ చిత్రంతో బిజీగా అయ్యారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ కోసం డేట్స్ ఇచ్చారు తారక్. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతుందీ సినిమా. ఇందులో తారక్ రా ఏజెంట్‌గా కనిపించనున్నారని.. హృతిక్, ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సీన్స్ అదిరిపోనున్నాయని టాక్. ఇద్దరి కాంబోలో ఓ సాంగ్ సైతం ఉంటుందని బీటౌప్‌లో టాక్ వినిపిస్తోంది తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్థా కపూర్ స్పెషల్ సాంగ్ చేయనుందని తెలిసింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. ఇప్పుడు శ్రద్థా కపూర్ స్పెషల్ సాంగ్ చేయనుందని.. హృతిక్, ఎన్టీఆర్, శ్రద్థా కాంబోలో ఈ సాంగ్ ఉండనుందని టాక్. ఎన్నో హిందీలో చిత్రాల్లో నటించిన శ్రద్ధా సూపర్ డాన్సర్ కూడా. ఇక తారక్ స్పీడ్‌కి ఆమె స్పీడ్ కలిస్తే సిల్వర్ స్ర్కీన్ దద్దరిల్లిపోవాల్సిందే. గత ఏడాది 'స్త్రీ 2' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేేసందుకు రెడీ కావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
Latest News