![]() |
![]() |
by Suryaa Desk | Tue, Feb 11, 2025, 10:39 PM
మంచు విష్ణు తన డ్రీమ్ అని చెబుతూ వస్తున్న సినిమా 'కన్నప్ప'. ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. భారీ తారాగణంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్న ఆయన, ప్రతి సోమవారం ఓ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న (సోమవారం) కన్నప్ప మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. విడుదల చేసిన కాసేపట్లోనే భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సాంగ్.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండటం విశేషం.శివా శివా శంకరా సాంగ్ అంటూ సాగిపోతున్న ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. విజయ్ ప్రకాష్ పాడారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ప్రభుదేవా కొరియోగ్రాఫీ చేశారు. అద్భుతమైన మ్యూజిక్, అందుకు తగ్గట్టుగా శివయ్య స్మరణలో మంచు విష్ణు యాక్టింగ్, సాంగ్ కొరియోగ్రఫీ, పిక్చరైజేషన్ అన్నీ సూపర్ గా ఉండటంతో ఈ పాటకు భారీ ఆదరణ దక్కుతోంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఒక్క పాటతోనే కన్నప్ప సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ పాట యు ట్యూబ్ లో 4. మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని 5 మిలియన్ కి చేరువలో వుంది.