![]() |
![]() |
by Suryaa Desk | Tue, Feb 11, 2025, 02:26 PM
ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ ఆస్పత్రి పాలైనట్లు సమాచారం. రష్మీ భుజం నొప్పికి సర్జరీ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. రష్మీ సోషల్ మీడియాలో ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను షేర్ చేసింది. 'భుజం నొప్పి కారణంగా డ్యాన్స్ చేయడాన్ని చాలా మిస్ అవుతున్నాను. మళ్లీ ఎప్పటిలా మీముందుకు రావాలని ఆతృతగా ఎదురుచూస్తున్నా' అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ రష్మీ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.అలాగే ఈ అమ్మడు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ బుల్లితెరపై రాణిస్తోంది. ఇక రష్మీ, కమెడియన్ సుడిగాలి సుధీర్ తో ఎన్నో రియాలిటీ షోలు చేసి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను దక్కించుకుంది. అయితే వీరిద్దరు గత కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారనే ప్రచారం నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. కానీ వీరు మాత్రం అవన్నీ పుకార్లే అని కొట్టిపారేసినప్పటికీ నిత్యం రష్మీ, సుధీర్‌కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.
Latest News