![]() |
![]() |
by Suryaa Desk | Sat, Feb 08, 2025, 03:06 PM
ప్రస్తుతం ఇండస్ట్రీలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు తమన్ . ఏదైనా సరే తమన్ తన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక మాస్ లకు తమన్ అందించే సంగీతానికి సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది.ముఖ్యంగా బాలకృష్ణ లకు తమన్ ఓ రేంజ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తారు. అఖండ, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ లతో తమన్ నందమూరి అభిమానుల అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఫ్యాన్స్ ఇప్పుడు తమన్ ను నందమూరి థమన్ అని సరదాగా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం తమన్ చేతినిండా లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో తమన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. తన కెరీర్ లో ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అని అన్నారు. అలాగే కొందరు వ్యక్తులను నమ్మి మోసపోయాను అని అన్నారు తమన్. ఈ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. “జీవితంలో ఎదో ఒక సమయంలో మనం కొందరు వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోతాము. నాకు కూడా అలానే జరిగింది. నేను చాలా మందిని నమ్మా.. కానీ నేను నమ్మిన వారే నాకు వెన్నుపోటు పొడిచారు అని అన్నారు తమన్.నా గురించి నా ముందు మంచిగా మాట్లాడి.. బయటకు వెళ్లి నాగురించి చాలా చెత్తగా మాట్లాడేవారు. అంతే కాదు కొందరిని నమ్మి చాలా డబ్బు కూడా పోగొట్టుకున్నాను. నా జీవితంలో ఎదురైనా ఒడిదుడుకులతో నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను అని అన్నారు తమన్. అలాగే ఆయన మాట్లాడుతూ.. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం.. వర్క్ లో ఒత్తిడికి గురైనప్పుడు నేను వెంటనే గ్రౌండ్ కు వెళ్లి క్రికెట్ ఆడతా.. స్టార్ క్రికెటర్స్ ఆడే గ్రౌండ్ లో ఆడాలని ఎంతో ఆశ ఉండేది. కానీ అప్పట్లో అది కుదరలేదు అని బాధపడేవాడిని. కానీ ఇప్పుడు సెలబ్రెటీ క్రికెట్ లీగ్ పుణ్యమా అని ఆ బాధ తగ్గింది.
Latest News