![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 01:03 PM
పుష్ప’ సినీ ప్రయాణంలో ఐదు నిమిషాల నుంచి ఐదేండ్ల వరకూ భాగమైన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఈ సక్సెస్ క్రెడిట్ దర్శకుడు సుకుమార్‌తో పాటు సినిమా కోసం కష్టపడి పనిచేసిన టీమ్‌కు దక్కుతుంది. ఆయన సీన్ చెప్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఈ సినిమా కోసం వెచ్చించిన ఐదేళ్లు నాకెంతో ప్రత్యేకం. ఈ సినిమా అందరికీ జీవితాంతం గుర్తుండిపోతుంది. ‘పుష్ప 3’ ఓ అద్భుతం’’ అని ‘పుష్ప 2’ థ్యాంక్స్ మీట్‌లో అల్లు అర్జున్ అన్నారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ‘‘మైత్రీ మూవీస్ సీఈఓ చెర్రీ సలహాతోనే ‘పుష్ప’ మూడు భాగాలుగా తయారైంది. ఈ విజయం మైతీ మూవీ మేకర్స్‌కి అంకితం చేస్తున్నాను. ఈ ప్రపంచంలో నన్ను ఎక్కువగా నమ్మే వ్యక్తి అల్లు అర్జున్’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా విజయం ఎంతో మంది కష్టంతో వచ్చింది. ఈ విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని నిర్మాత యలమంచిలి రవిశంకర్ అన్నారు. ‘‘సినిమా అంచనాలను మించి కలెక్ట్ చేస్తుందని అనుకున్నాం కానీ.. ఇంత ఘనవిజయం సాధిస్తుందని అనుకోలేదు’’ అని నిర్మాత నవీన్ యెర్నేని తెలిపారు.
Latest News