![]() |
![]() |
by Suryaa Desk | Tue, Feb 11, 2025, 04:11 PM
సంక్రాంతికి వస్తున్నాం.. చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లిరాజు ఫేమ్ అయిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేశ్ కు ఈ చిత్రంలో కొడుకు పాత్రలో నటించి మెప్పించాడు. సినిమా రిలీజైన దగ్గర నుంచి సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా మనోడి వీడియోలే కనిపిస్తున్నాయి. ఒక్క సినిమాతో ఆ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్నాడు కాబట్టే, ఇప్పుడు రేవంత్ ను 'లైలా' మూవీ ప్రమోషన్స్ లో భాగం చేస్తున్నారు.మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ న్యూ ఏజ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ వాలెంటైన్స్ డే స్పెషల్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. టీజర్, సాంగ్స్, ట్రైలర్ అంటూ హడావిడి చేస్తున్నారు. రీసెంట్ గా 'బాయ్ కాట్ లైలా' ట్రెండ్ కూడా ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకునేలా చేసింది. అయితే ఇప్పుడు బుల్లిరాజు అలియాస్ రేవంత్ తో లైలా టీం ఓ ప్రమోషనల్ వీడియో ప్లాన్ చేసింది. దీన్ని మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
Latest News