![]() |
![]() |
by Suryaa Desk | Fri, Feb 07, 2025, 05:43 PM
మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి యొక్క కొత్త చిత్రం 'బజూకా' నిర్మాణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కొత్త దర్శకుడు డీనో డెన్నిస్ దర్శకత్వం వహించిన ఈ గేమ్ థ్రిల్లర్ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. బాజూకా ట్రైలర్ మూవీపై భారీ హైప్ ని క్రైట్ చేసింది.తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 10,2025న విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో జగదీష్, సిద్ధార్థ్ భరతన్ మరియు సన్నీ వేన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నిమిష్ రవి మరియు రాబి వర్గీస్ రాజ్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, మిధున్ ముకుందన్ సంగీతం సమకూర్చారు. యోడులే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి మాజీ ఆర్మీ అధికారి మరియు ట్రావెల్ జంకీగా వినీత్ మీనన్‌గా కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News