![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 02:46 PM
ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అంతా జనసేనే. జై జనసేన’ అంటూ నినదించి మెగా అభిమానులను ఉత్సాహపరిచారు చిరంజీవి. విష్వక్‌సేన్ కథానాయకుడిగా నటించిన ‘లైలా’ చిత్రం ఈనెల 14 న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపైన ఉన్న విష్వక్‌సేన్ తండ్రి కరాటే రాజుతో తన అనుబంధం గురించి ప్రస్తావిస్తూ చిరంజీవి పై వ్యాఖ్యలు చేశారు.
‘మేం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయంగా ఎదగాలనే తన కోరికను కరాటే రాజు నా దగ్గర ప్రస్తావించాడు. దాంతో ప్రజారాజ్యం తరపున అవకాశం ఇచ్చాం. కానీ అప్పట్లో పరిస్థితులు ఇంకోలా ఉన్నాయి’ అని చిరంజీవి చెప్పారు. అలాగే మేనల్లుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ విజయం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ‘‘పుష్ప 2’ పెద్ద హిట్టయింది. అందుకు నేను గర్విస్తున్నా. ఒక్కోసారి కొన్ని సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కానీ ఒక సినిమా బాగా ఆడితే దాన్ని ఇండ స్ట్రీలో ప్రతి ఒక్కరూ హర్షించాలి’ అన్నారు.
Latest News