![]() |
![]() |
by Suryaa Desk | Sat, Feb 08, 2025, 03:50 PM
మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇపుడు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళితో పాన్ వరల్డ్ లెవెల్ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా కోసం ప్రపంచమే ఎదురు చూస్తుండగా మహేష్ బాబు నుంచి ఇప్పుడో క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. మహేష్ కి హైదరాబాద్ లో తన ఏఎంబి మాల్ అండ్ థియేటర్స్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే అందులో ఇపుడు ఆడియెన్స్ కోసం ఒక సరికొత్త ఎక్స్ పీరియన్స్ ని అందించేందుకు ముందడుగు వేశారు. హైదరాబాద్ లో ఎక్కడా లేని విధంగా కంప్లీట్ రాయల్ గా లగ్జరీతో కూడిన స్పెషల్ స్క్రీన్స్ తో కూడిన థియేటర్స్ ని “MB LUXE” గా తన మాల్ లో నిర్మించి ఇపుడు అనౌన్స్ చేయడం జరిగింది. దీనితో ఈ విజువల్స్ చూసి అంతా ఓ రేంజ్ లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనితో మహేష్ అభిమానులు తనకి బెస్ట్ విషెస్ ని కూడా తెలియయజేస్తున్నారు.
Luxury comfort… and an experience of the highest magnitude….That’s #MBLUXEWishing the team at @amb_cinemas all the best!! pic.twitter.com/f2XMEjBDdw
— Mahesh Babu (@urstrulyMahesh) February 8, 2025