![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 03:07 PM
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ యొక్క తదుపరి బిగ్గీ 'RC 16' కి బుచి బాబు సనా దర్శకత్వం వహించారు. నటుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి షూటింగ్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ని లాక్ చేయటానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, మీర్జాపూర్ నటుడు దివైందూ శర్మ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసిన సంగతే. ఇన్సైడ్ టాక్ ఏమిటంటే దివైందూ శర్మ RC16 సెట్లలోకి ప్రవేశించి తన పాత్ర కోసం షూటింగ్ ప్రారంభించాడు. అతను రామ్ చరణ్ పాటు దృశ్యాలను చిత్రీకరించాడు మరియు మరియు మెగా అభిమానులు, సినిమా ప్రేమికులు దానిపై ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రంలో జాన్వి కపూర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రత్నావెలూ ISC ఈ ప్రాజెక్ట్ కోసం విజువల్స్ ను నిర్వహిన్నారు. ఈ గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాలో జగపతి బాబు, శివ రాజ్‌కుమార్, దివేండు శర్మ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో ఉన్నారు. AR రెహ్మాన్ సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో, RC 16 ప్రధాన పాన్-ఇండియన్ విడుదల కానుంది. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి వెంకట సతీష్ కిలారు తన వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఆర్‌సి 16 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News