![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 02:57 PM
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది కానీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. అయితే ఈ చిత్రం ఇటీవల ఓటిటిలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా ఇందులో హిందీ మినహా మిగతా భాషల్లో ఇపుడు స్ట్రీమింగ్ అవుతుంది.అయితే ఓటిటిలో వచ్చాక పలు అంశాల్లో మళ్ళీ ప్రశంసలు కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి కానీ వీటి అన్నిట్లో కూడా ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అదరగొడుతుంది. ఇలా ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ప్రైమ్ వీడియోలో ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. దీనితో గేమ్ ఛేంజర్ కి ఓటిటిలో విశేష ఆదరణ లభిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
Latest News