![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 11:30 AM
అక్కినేని నాగ చైతన్య నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. సాయి పల్లవి కథానాయిక నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్, యాక్షన్, దేశభక్తి బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి ఆట నుంచే పాటిజివ్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.విడుదలైన మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.62.37 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఈ పోస్టర్ వైరల్‌గా మారగా.. అక్కినేని అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇక చిత్ర బృందం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.
Latest News