![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 04:14 PM
ఎన్టీఆర్ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద బ్రాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని ఆయన కుమారులు, కూతుర్లు, అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు అన్ని రంగాల్లో గొప్పగా ముందుకు తీసుకుపోతున్నారు. ఇక నటన రంగంలో జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా గొప్ప శిఖరాలను అధిరోహిస్తునాడు. ఈ మధ్య కాలంలో ఆయన పేరు అంతర్జాతీయంగా మార్మోగడం తెలుగు వారికి గర్వ కారణంగా నిలుస్తున్నాడు.ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత ఫిఫా వరల్డ్ కప్ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్స్ నెయ్‌మార్, టెవెజ్, రొనాల్డోల పుట్టినరోజు నాడు నాటు స్టెప్పులతో హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అని పోస్ట్ చేయడం గ్లోబల్ వైడ్ గా సంచలనం సృష్టించింది.
తాజాగా ఇండియా టూర్ లో బిజీగా గడుపుతున్న అమెరికన్ పాప్ ఐడల్ ఎడ్ షీరన్ బెంగుళూరు కన్సర్ట్ లో గాయని శిల్పారావుతో కలిసి దేవర చిత్రంలోని 'చుట్టమల్లె' సాంగ్ ని పాడటం అందరి దృష్టిని ఆకర్షింది. దీనికి ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ.. " సంగీతానికి బౌండరీలు లేవు. ఎడ్ ఈ పాటని తెలుగులో పాడటం చాలా స్పెషల్"గా అనిపించిందని ఆయన పేర్కొన్నాడు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అకాడమీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఇద్దరు ఇండియన్స్ ని మాత్రమే ఫాలో అవుతుంది. అందులో ఒకరు బాలీవుడ్ 'బాద్ షా' షారుఖ్ ఖాన్ కాగా మరొకరు టాలీవుడ్ 'బాద్ షా' ఎన్టీఆర్.
Latest News