by Suryaa Desk | Mon, Feb 10, 2025, 04:25 PM
ఈ ఏడాది సంచలన విజయం సాధించిన అంటే టక్కున చెప్పే పేరు సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో వెంకటేష్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులచేత నవ్వులు పూయించారు. అలాగే వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. తొలి షో నుంచి సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మూవీ టీమ్ మొత్తం ఆనందంలో తేలిపోతున్నారు.ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాగా ఈ లల్లో సంక్రాంతి వస్తున్నాం భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. వెంకటేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఈ అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. ఈ లో ముఖ్యంగా వెంకటేష్ తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఐశ్వర్య రాజేష్ కూడా తన నటనతో అలరించింది. అనిల్ ఈ తో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ త్వరలోనే ఓటీటీలోకి రానుంది.ఈ మూవీ ఓటీటీ కంటే ముందు టీవీలోకి రానుందని తెలుస్తుంది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ప్రముఖ ఛానెల్ జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు అధికారికంగా ప్రకటించింది. కాగా ఫిబ్రవరి మూడో వారంలో సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీలో విడుదల అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఈ డిజిటల్ రైట్స్ ను జీ 5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఛానెల్ లో టెలికాస్ట్ అనౌన్స్ చేయడం తో అభిమానులు అవాక్ అవుతున్నారు. త్వరలోనే సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు.
Latest News