![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 03:56 PM
మలయాళీ నటి పార్వతి నాయర్ పెళ్లి పీటలెక్కారు. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్‌ను ఆమె వివాహమాడారు. పాపిన్స్, నిమిరిందు నిల్, ఎన్నై అరిందుల్(ఎంతవాడు గానీ), ఉత్తమ విలన్, ఓవర్ టేక్ వంటి సినిమాల్లో ఆమె నటించారు. పెళ్లి చేసుకున్న కొత్త జంటకు విషెస్ చెబుతూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.నటి పార్వతి వేణుగోపాల్ నాయర్ కేరళలో పుట్టి పెరిగినా, ఆమె అబుదాబిలోనే పెరిగారు. ఆమె తండ్రి దుబాయ్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త. పార్వతి తల్లి కళాశాల ప్రొఫెసర్. పార్వతి తమ్ముడు శంకర్ ఐపీఎల్ జట్టు 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్'లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు.అబుదాబిలో స్కూల్ చదువు పూర్తి చేసిన పార్వతి నాయర్, 15 ఏళ్లకే మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివారు. కాలేజీలో చదువుతున్నప్పుడు మోడలింగ్‌లో చురుగ్గా పాల్గొన్నారు. కర్ణాటక 'మైసూర్ శాండల్ సోప్' బ్రాండ్ అంబాసిడర్‌గా, నేవీ క్వీన్ అందాల పోటీలో టైటిల్ గెలుచుకున్నారు.
Latest News