![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 01:06 PM
పోర్చుగల్ కార్ రేస్ పోటీల కోసం శిక్షణ పొందుతున్న హీరో అజిత్ కారు మరోమారు ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని అజిత్ ఆదివారం వెల్లడించారు. ‘నా అభిమానులు మాత్రమే కాకుండా, నేను ఏం చేయబోతున్నానో తెలుసుకునేందుకు అమితాసక్తితో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు. ఈ రోజు కూడా శిక్షణలో నా కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. దాన్ని మెకానిక్ బృందం రిపేర్ చేసింది’ అని ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన 24హెచ్ కార్ రేస్ పోటీల కోసం శిక్షణ పొందుతుండగా, అజిత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. దీంతో ఆ పోటీల నుంచి అజిత్ తప్పుకున్నారు. అయినప్పటికీ అజిత్ కుమార్ రేసింగ్ టీం ఆ పోటీల్లో మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో అజిత్ కుమార్‌కు ‘లిబర్టీ ఆఫ్ ది గేమ్’ అనే అవార్డును కూడా ప్రదానం చేశారు.
Latest News