![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 04:10 PM
ఆదివారం హైదరాబాద్ లో జరిగిన విశ్వక్ సేన్ 'లైలా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ చేసిన పొలిటికల్ కామెంట్స్ కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. దీంతో పలువురు విశ్వక్ 'లైలా'ని బ్యాన్ చేయాలనీ సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించారు. అలాగే ఈ సినిమా పైరసీ ప్రింట్ ని రిలీజ్ చేస్తామని ధమ్కీలు ఇస్తున్నారు. దీంతో ఈ చిత్ర నిర్మాత సాహూ గారపాటి, హీరో విశ్వక్ సేన్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారు.మొదటగా నిర్మాత సాహూ గారపాటి మాట్లాడుతూ.. ' సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ చూసి షాక్ అయ్యాను. పృథ్వీ కామెంట్స్ చేసినప్పుడు మేము అక్కడ లేము. చిరంజీవి గారికోసం కోసం బయట వెయిట్ చేస్తున్నాం. సినిమా అనేది ఎందరో కష్టంతో తయారవుతుంది. చివరకు మేము అందరికి క్షమాపణలు తెలుపుతున్నాం' అన్నారు.హీరో విశ్వక్ మాట్లాడుతూ.. 'బాయ్ కాట్ లైలా అని ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 25 వేల ట్వీట్స్ వేశారు. ముఖ్యంగా వాడి ఖాతాలో వీడు బలి, త్వరలోనే సినిమా HD ప్రింట్ రిలీజ్ చేస్తామని ట్వీట్స్ చేస్తున్నారు. మా సినిమాను పైరసీ చేస్తామని అంటున్నారు. సినిమాలు వాళ్లంటే చులకన అయిపోయారు. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఆయన ఆ వ్యాఖ్యలు చేసే సమయంలో నేను చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళాను. ఆయన స్టేజ్ పైన ఏం మాట్లాడారో కూడా మాకు అప్పుడు తెలీదు. ఈవెంట్ అయిపోయాక ఇంటికి వెళ్ళాక ఈ విషయం తెలిసింది. మా కంట్రోల్ లోని విషయం గురించి మేము ఏం చేయగలం. దయచేసి సినిమాని బలి చేయకండి' అంటూ మాట్లాడారు.
Latest News