![]() |
![]() |
by Suryaa Desk | Mon, Feb 10, 2025, 02:45 PM
ప్రస్తుతం హీరోలతో పాటు విలన్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా పాన్ ఇండియా కాన్సెప్ట్ ఊపందుకున్న తర్వాత స్టార్స్ యాక్టర్స్ విలన్లుగా నటించడంతో వారికి విపరీతమైన క్రేజ్ ఏర్పడటంతో పాటు భారీ రెమ్యునరేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. కల్కి, జవాన్. యానిమల్ సినిమాల్లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, బాబీ డియోల్ వంటి స్టార్ యాక్టర్స్ నటించి భారీ రెమ్యునరేషన్ కొల్లగొట్టారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ కాదు స్టార్ హీరోయిన్ ఇప్పుడు విలన్ గా నటించి అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ కొల్లగొట్టి సరికొత్త రికార్డ్ సృష్టించనుంది.ప్రస్తుతం ఆ హీరోయిన్ కెరీర్‌కు పెద్ద డోకా ఎం లేదు. స్టార్ హీరోలతో సినిమాలలో నటిస్తూ మరోవైపు ఓటీటీలలోను యాక్షన్ వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది.
ఆ స్టార్ హీరోయిన్ విలన్‌గా మారిందంటే.. ఎవరో వయస్సు మీదపడినా నటి అనుకుంటే పెద్ద పొరపాటే. ఆమె ఎవరో విదేశీ నటి కాదు. ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది కూడా విదేశీ సినిమాకు కాదు. తెలుగు సినిమాకే. ఎవరని షాక్ అవుతున్నారా? ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు. ప్రియాంక చోప్రా. దర్శకుడు రాజమౌళి.. మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న 'SSMB 29' సినిమాలో ఆమె విలన్ గా నటిస్తుందట. దీనికోసం ఆమె అక్షరాల రూ. 30 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనుందట. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాలో ఒక విలన్ కు ఇంతా పారితోషకం ఇవ్వలేదు. అంత ఎందుకు ఇప్పటి వరకు ఇంత రెమ్యునరేషన్ ని చాలా మంది స్టార్ హీరోలు కూడా అందుకోకపోవడం గమనార్హం.
Latest News