![]() |
![]() |
by Suryaa Desk | Tue, Feb 11, 2025, 03:42 PM
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేయగా పూర్తి లవ్ స్టోరీ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మేజర్ అట్రాక్షన్‌గా థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లో మంచి టాక్‌తో దూసుకెళ్లడంతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాకు ఎంతో కీలకమైన మండే టెస్ట్‌ను కూడా ‘తండేల్’ గెలిచిందని ఈ మూవీ టికెట్ బుకింగ్స్ చూస్తూ అర్థమవుతుంది. నాలుగో రోజైన సోమవారం నాడు తండేల్ వసూళ్ల పర్వం కొనసాగించింది. ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.73.20 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.నాగ చైతన్య కెరీర్‌లో సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తున్న ‘తండేల్’ ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేశారు.
Latest News