by Suryaa Desk | Mon, Feb 10, 2025, 02:51 PM
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్ 2 ఈ ఎంపురాన్’. ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆశిర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మంజు వారియర్, టొవినో థామస్, ఇంధ్రజిత్ సుకుమారన్, జైస్ జోస్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్, జైస్ జోస్ పోషించిన జేవియర్ పాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. జైస్ జోస్ ఈ మూవీ చిత్రీకరణ అనుభవాలను వీడియో ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కొందరు ఇంటర్నేషనల్ యాక్టర్స్ నటిస్తున్నట్టుగా గతంలో వార్తలు వెలువడ్డాయి.అయితే ఇప్పుడు యూకేకు చెందిన ఇద్దరు యాక్షన్ స్టార్స్ నటించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాలీవుడ్‌కు చెందిన ఓ ఏజెన్సీ ఈ సమాచారాన్ని వెల్లడించింది. కొరియన్ అమెరికన్ నటులు రిక్ యూన్, ఆండ్రియా టి వాడర్ కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు ఆ ఏజెన్సీ తొలుత సోషల్ మీడియాలో షేర్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసినట్లు మాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
Latest News