![]() |
![]() |
by Suryaa Desk | Fri, Feb 07, 2025, 08:26 PM
టాలీవుడ్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘కాస్కో’ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చి కలవర్ కింగ్, ఆకాశంలో సగం, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, రైడ్ వంటి చిత్రాల్లో నటించింది. ఇక వరుణ్ సందేశ్ సరసన ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా తెలుగు, తమిల, హిందీ మూవీస్‌లో నటించి మెప్పించింది. కానీ ఈ అమ్మడు 2022 నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. మళ్లీ రెండేళ్ల తర్వాత శ్వేతా బసు ప్రసాద్ రీఎంట్రీ ఇచ్చింది. ఆమె ఓ బోల్డ్ వెబ్‌సిరీస్ ‘ఊప్స్ అబ్ క్యా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయితే ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కాబోంతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓటీటీ సంస్థ ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇందులో.. తన యూరినరీ ట్రాక్ట్‌లో ఇన్ఫెక్షన్ కోసమంటూ డాక్టర్ దగ్గరికి వెళ్లిన ఆమెకు అనుకోకుండా మరో అమ్మాయిలోకి ఇన్సర్ట్ చేయాల్సిన వీర్యాన్ని పంపిస్తారు వైద్యులు. దీంతో ఆమె గర్భం దాలుస్తుంది. అయితే బాయ్‌ఫ్రెండ్ ఉన్న కూడా తన అమ్మమ్మ చెప్పిన మాటను గుర్తుకు పెట్టుకుని సెక్స్ చేయని తాను ఎలా తల్లిని కాబోతున్నానో ఆమెకు అర్ధం కాక షాక్ అవుతుంది.
ఆ తర్వాత అసలు విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. అయినప్పటికీ తన బాయ్‌ఫ్రెండ్‌ను మోసం చేసి బాస్‌తో రొమాన్స్ చేస్తున్నట్లు కలలు కంటుంది. అలా బాస్‌పై మనసు పడిన అమ్మాయి ఎక్కడపడితే అక్కడ రొమాన్స్ చేస్తుంటుంది. దీంతో ఆమెను బాయ్‌ఫ్రెండ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో బ్రేకప్ అవుతున్నట్లు చూపించారు. దేబాత్మ మండల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సిరీస్‌ను డైస్ మీడియా బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో శ్వేతా బసు ప్రసాద్, ఆశిమ్ గులాటి, జావెద్ జాఫ్రీ(Javed Jaffrey), సోనాలి కులకర్ణి(Sonali Kulkarni), అపర మెహతా(Apara Mehta), అభయ్ మహాజన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.