![]() |
![]() |
by Suryaa Desk | Sat, Feb 08, 2025, 02:56 PM
ప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్నది. ఒకనాడు అగ్ర తారలుగా వెలుగొందిన నటీనటుల జీవితాలను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో ఈ తరహా చిత్రాలెన్నో వచ్చాయి. తాజాగా బాలీవుడ్ మేటి నటి పర్వీన్ బాబీ జీవిత కథ వెబ్‌సిరీస్ రూపంలో రానుంది. పర్వీన్ బాబీ పాత్రలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రి నటించనుంది. షోనాలీబోస్ దర్శకత్వం వహించబోతున్న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.70-80దశకంలో హిందీ చిత్రసీమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది పర్వీన్ బాబీ. అద్భుతమైన అందం, అభినయంతో ఆనాటి యువతరాన్ని ఆకట్టుకుంది. అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో పర్వీన్ బాబీ బయోపిక్ అందరిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఈ సినిమా కోసం త్రిప్తి డిమ్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని, పర్వీన్‌బాబీ నటించిన సినిమాలను చూస్తూ ఆమె నటనా శైలి, హావభావాలను అర్థం చేసుకుంటున్నదని దర్శకుడు తెలిపారు.
Latest News