![]() |
![]() |
by Suryaa Desk | Tue, Feb 11, 2025, 03:50 PM
విజయ్ దేవరకొండ కాంపౌండ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయని తెలిసిందే. వీటిలో ఒకటి వీడీ12 . జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ టైటిల్ టీజర్‌ను ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్. వీడీ 12 హిందీ టీజర్‌కు యానిమల్ హీరో రణ్‌బీర్‌కపూర్ వాయిస్ ఓవర్ అందించబోతున్నాడు. కథ ఇప్పుడు మరింత వైల్డ్‌గా ఉండబోతుంది.. అంటూ విడుదల చేసిన తాజా వార్తతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.ఈ సినిమాను మే 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారని వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని సితారఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ తొలిసారి ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడు.
Latest News