![]() |
![]() |
by Suryaa Desk | Tue, Feb 11, 2025, 04:46 PM
తెలుగు తమిళ భాషల్లో ఐశ్వర్య రాజేశ్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. నాయిక ప్రధానమైన సినిమాలతోనే కాదు, వెబ్ సిరీస్ లతోను ఆమె బిజీగా ఉంది. అలాంటి ఐశ్వర్య రాజేశ్ నుంచి ప్రేక్షకులను పలకరించడానికి ఇప్పుడు మరో వెబ్ సిరీస్ రెడీ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మితమైన ఆ సిరీస్ పేరే 'సుడల్ 2'. సీజన్ -1 విషయానికి వస్తే, 2022లో జూన్ 17వ తేదీన స్ట్రీమింగ్ అయింది. ఈ సీజన్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి సీజన్ 2 కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. అలా ఇప్పుడు సీజన్ 2 ట్రాకులోకి వస్తోంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఐశ్వర్య రాజేశ్ కాథీర్ గౌరీ కిషన్ మంజిమా మోహన్ పార్తీబన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి పుష్కర్ - గాయత్రి క్రియేటర్స్ గా వ్యవహరించారు. సర్జున్ - బ్రహ్మ దర్శకత్వం వహించారు.ఫస్టు సీజన్ విషయానికి వస్తే " ఒక సిమెంటు ఫ్యాక్టరీలో వర్కర్స్ యూనియన్ ప్రెసిండెంటుగా షణ్ముగం ఉంటాడు. ఆయన కూతురు నీల .. పోలీస్ ఆఫీసర్ రెజీనా తమ్ముడు 'అతిశయం' ప్రేమించుకుంటారు. ఈ విషయాన్ని గురించి ఊళ్లోవాళ్లు గుసగుసలాడుకుంటూ ఉన్న సమయంలోనే, వాళ్లిద్దరి శవాలు చెరువులో తేలతాయి. వాళ్లది ఆత్మహత్య కాదు హత్య అని నీల అక్కయ్య నందిని (ఐశ్వర్య రాజేశ్)కి అనుమానం కలుగుతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుందనేది కథ.
Latest News