![]() |
![]() |
by Suryaa Desk | Tue, Feb 11, 2025, 07:22 PM
టాలీవుడ్ కమెడియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో రావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. విష్వక్ సేన్ తాజా చిత్రం 'లైలా' ప్రీరిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ సినిమాలో 150 మేకలు ఉంటాయని.. చివరి సీన్ లో తనను జైలు నుంచి రిలీజ్ చేస్తారని, అప్పుడు లెక్కిస్తే 11 మేకలు ఉన్నాయని ఆయన కామెంట్ చేశారు. గతంలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఆ సంఖ్య 11కి పడిపోయింది. దీంతో, పృథ్వీ వైసీపీని కామెంట్ చేశారంటూ ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 'బాయ్ కాట్ లైలా' అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. దీంతో, విష్వక్ సేన్ వివరణ ఇవ్వడమే కాకుండా, క్షమాపణ చెప్పారు. ఈ సినిమాలో పృథ్వీ ఒక నటుడు మాత్రమేనని, ఆయన మాటలు పట్టించుకోవద్దని కోరారు
Latest News