|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 12:01 PM
తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్‌తో పాటు 11 మందితో మంత్రులుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన 'ఆరు గ్యారంటీ'లకు సబంధించిన ముసాయిదాపై సీఎం హోదాలో రేవంత్ తొలి సంతకం చేయనున్నారు.
భట్టి విక్రమార్క ప్రస్థానం:
డిప్యూటీ సీఎంగా ఎన్నికైన మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో నుంచి నాల్గో సారి విజయం సాధించారు. 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో చీఫ్ విప్‌గా పని చేశారు. అంతకు ముందు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2011న ఉమ్మడి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 2014లో మధిర నియోజకవర్గం నుంచి రెండోసారి.. 2018లో మధిర నుంచే మూడోసారి గెలుపొందారు. 2019 నుంచి CLP లీడర్‌గా ఉన్నారు.
దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రస్థానం:
తాజాగా మంత్రివర్గంలోకి ఎంపికైన దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు.. మంథని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. మంథని నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి సారిగా గెలుపొందారు. 2004, 2009, 2018, 2023 మంథని నుంచి MLA గా విజయం సాధించారు. 2004-2019 వరకు ప్రభుత్వ చీఫ్ విప్ కూాడ ఉన్నారు. 2014లో మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ ప్రస్థానం:
తెలంగాణ మంత్రి వర్గానికి ఎంపికైన కాంగ్రెస్ నేత కొండా సురేఖ మొదటగా1999లో శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో శాయంపేట నుంచి 2వ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో 3వ సారి పరకాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. 2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. 2013లో వైసీపీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి BRS ఎమ్మెల్యేగా 4వ సారి విజయం సాధించారు. 2018లో BRSకు రాజీనామా, కాంగ్రెస్‌లో చేరారు. 2023లో వరంగల్ తూర్పు నుంచి MLAగా ఐదోసారి గెలుపొందారు.